అపరిచిత గద్యాలు
8 అపరిచిత గద్యం-2
మనదేశంలో కేవలం ముగ్గురు నలుగురికి మాత్రమే ఉన్న అత్యంత అరుదైన బ్లడ్ గ్రూప్ “పీ-నల్”. ఆ బ్లడ్ గ్రూప్ కోసం ఆ మధ్య ఒక డాక్టర్ పెద్ద యుద్ధమే చేసింది. గుజరాత్ కు చెందిన ఒక పాప మెట్ల మీద నుండి పడి తీవ్ర గాయాల పాలయ్యింది. దాదాపుగా కోమాలోకి వెళ్లే పరిస్థితి. ఆ పాపను చివరికి ఎర్నాకులంలో “అమృత” హాస్పిటల్ లో చేర్పించారు. అక్కడి డాక్టర్ వీణా షేనాయ్. పాపది “పీ-నల్ ” బ్లడ్ గ్రూప్ అని తెలుసుకుంది. ఆ రక్తం ఎక్కిస్తేనే పాప బతుకుతుంది. అందుకే దేశ విదేశాల్లోని బ్లడ్ బ్యాంకులను సంప్రదించింది. కార్పొరేట్ ఉద్యోగుల డేటా సేకరించింది. చివరకు ట్విట్టర్లో అధిక పరిచయాలు కలిగిన శశి థరూర్ తో పోస్ట్ చేయించింది.ఇక దేశం మొత్తం అన్వేషణ మొదలైంది. అయితే నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇమ్యూనో హెమథాలజీకి చెందిన డాక్టర్ స్వాతి కులకర్ణి నాసిక్ ప్రాంతంలోని ఒక వ్యక్తికి ఈ బ్లడ్ గ్రూప్ ఉందని చెప్పారు. వీణా షేనాయ్ నాసిక్ కు వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామానికి చేరుకుని , అతడిని బ్లడ్ బ్యాంకుకు తీసుకువచ్చి , పరీక్షలు చేసి , అతడిది “పీ-నల్” బ్లడ్ గ్రూప్ అని తేల్చి , ఓ కొరియర్ సర్వీసు తో మాట్లాడి సరైన చల్లదనం పాటించే కంటైనర్ లో రక్తాన్ని ఎర్నాకులం తెప్పించి, పాపకు ఆపరేషన్ చేసి బతికించింది. ఇప్పుడు పాప కోలుకుంది. మంచి జీవితం ప్రారంభించింది. ఒకరికి మేలు జరగడం కోసం మనం ఎంత శ్రమ తీసుకున్నా తప్పులేదు. అది చాలా గొప్ప విషయం కదా !
ప్రశ్నలు:
1.స్వాతి కులకర్ణి ఏ సంస్థకు చెందిన వైద్యురాలు ?
అ) నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ ఆ) నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెమథాలజీ ఇ) నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అమృత హాస్పిటల్ ఈ) నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజ్
2. వీణా షేనాయ్ పనిచేస్తున్న వైద్యశాల ఎక్కడ ఉంది?
అ) ఎర్నాకులమ్ ఆ) గుజరాత్ ఇ) నాసిక్ ఈ) ఏవీకావు
3. పాప గురించి ట్విట్టర్లో పోస్ట్ చేసింది ఎవరు?
అ) స్వాతి కులకర్ణి ఆ) వీణా షేనాయ్ ఇ) శశి థరూర్ ఈ) ఎవరూ కారు
4. ” పీనల్ ” బ్లడ్ గ్రూప్ ఎర్నాకులం ఎలా చేరింది ?
అ) వీణా షేనాయ్ కారులో ఆ) స్వాతి కులకర్ణి విమానంలో ఇ) కొరియర్ సర్వీస్ కంటైనర్లో ఈ) చల్లదనం ఉన్న రైలులో
5.పాప గాయాలకు కారణం ఏమిటి?
అ) మెట్లమీది నుండి పడటం ఆ) దెబ్బలు కొట్టడం ఇ) వాహనం ఢీ కొట్టడం ఈ) చెట్టుపైనుండి పడటం
Interactive Exercise-2