అపరిచిత గద్యాలు

27 అపరిచిత గద్యం- 21

మదనపల్లిలోని బీసెంట్‌ థియోసాఫికల్‌ కాలేజ్‌ని 1919లో ఠాగూర్‌ సందర్శించాడు. ఆ కాలేజీలో ఉన్నప్పుడు జన గణ మన గీతాన్ని ‘మార్నింగ్‌ స్టార్‌ ఆఫ్‌ ఇండియా పేరుతో అనువదించాడు.కాగా, జాతీయ గీతం పూర్తిగా 52 సెకండ్ల కాలవ్యవధిలో ఆలపించాలి. జాతీయ గీతాన్ని ఈ కింది ప్రభుత్వ కార్యక్రమాలలో, వివిధ సందర్భాలలో పూర్తిగా వినిపించాలి. సివిల్, మిలటరీ ఇన్ స్టిట్యూట్స్, రాష్ట్రపతి, గవర్నర్ కు గౌరవందనం సందర్భాల్లో ఆలపించాలి. అలాగే రాష్ట్రపతి, గవర్నర్ వంటి ప్రముఖులు లేకున్నప్పటికీ పరేడ్ లలో ఆలపిస్తారు. రాష్ట్రప్రభుత్వ అధికార కార్యక్రమాలకు, ఇతర ప్రభుత్వ కార్యక్రమాలకు, ప్రజా సందోహ కార్యక్రమాలకు రాష్ట్రపతి వచ్చినప్పుడు, వెళ్తున్నప్పుడు, ఆకాశవాణిలో రాష్ట్రపతి జాతినుద్దేశించి చేసే ప్రంగానికి ముందు, వెనుక ఆలపిస్తారు.రాష్ట్ర గవర్నర్ తన రాష్ట్ర పరిధిలో అధికారిక కార్యక్రమాలకు వచ్చినప్పుడు, నిష్ర్కమించేటప్పుడు,జాతీయ గీతాన్ని ఆలపిస్తారు. రెజిమెంటల్ కలర్స్ బహుకరించినప్పుడు, నౌకాదళంలో కలర్స్ ఆవిష్కరించినప్పుడు ఈ గీతాన్ని ఆలపిస్తారు. కొన్ని సందర్భాల్లో జాతీయ గీతాన్ని సంక్షిప్తంగా మొదటి, చివరి వరుసలను ఆలపించుకోవచ్చు. అలా ఆలపించడం 52 సెకండ్ల వ్యవధిలో పూర్తి చేయాల్సి ఉంటుంది. 1947లో ఐక్యరాజ్య సమితి జనరల్‌ అసెంబ్లీలో జాతీయ గీతం గురించి భారత ప్రతినిధి బృందాన్ని అడిగినప్పుడు జన గణ మన రికార్డింగ్‌ను జనరల్‌ అసెంబ్లీకి అందించారు. ఆ రోజు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రతినిధుల ముందు జాతీయగీతాన్ని ఆలపించారు. అయితే మన జాతీయ గీతాన్ని అన్ని దేశాలు ప్రశంసించారు. మూడు సంవత్సరాల తర్వాత అంటే 1950 జనవరి 24న భారత రాజ్యాంగంపై సంతకం చేయడానికి అసెంబ్లీ సమాశమైంది. ఈ సమయంలో దేశ మొదటి రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్‌ అధికారికంగా జన గణ మన ను జాతీయ గీతంగా ప్రకటించారు. ఈ నాడు ప్రతి విద్యార్థినీ విద్యార్థులు, పెద్దలు అందరూ తప్పక జాతీయ గీత అర్ధమును తెలుసుకొని గౌరవ భావాన్ని పెంచుకోవాల్సిన అవసరం వుంది.

ప్రశ్నలు

1. జన గణ మన రికార్డింగ్ ను మొదట ఎక్కడ అందించారు.

2. మన జాతీయ గీతాన్ని అధికారికంగా ప్రకటించింది ఎవరు?

3. ఠాగూర్ జన గణ మనను ఎక్కడివచ్చినప్పుడు అనువదించారు.

4. భారత రాజ్యాంగంపై సంతకం చేయడానికి అసెంబ్లీ ఏ రోజున సమావేశం అయింది.

5. ఈ క్రింది సందర్భాలలో జాతీయ గీతాన్ని ఎప్పుడు ఆలపిస్తారు.

Share This Book