అపరిచిత గద్యాలు

9 అపరిచిత గద్యం-3

జీవిత చరిత్రలను రాయడం సామాన్యమైన విషయం కాదు. జీవిత చరిత్రను కూలికి వ్రాయువారు చాలామంది వున్నారు. తమ పొట్ట నింపుకొనుటకై శక్తి సంపన్నులను సకల అలంకారాలతో వర్ణించి రావణుడిని రామునిగా, హిరణ్యకశిపుని హిరణ్య గర్భునిగా, పోతరాజును భోజరాజుగా,  పిసినారిని దానకర్ణునిగా చిత్రించి నవ్వుల పాలు అయ్యే వారు చాలామంది ఉన్నారు. అటువంటి  చరిత్ర రచనలు  నాలుగు దినాల పాటు కూడా నిలువవు. జాన్సన్ చరిత్ర రాసిన బాస్వేల్ కు దమ్మిడి లాభం కూడా లేదు. కానీ అది మాత్రం ఈ లోకంలో గొప్ప చరిత్రగా పేరు గడిచింది.జీవిత చరిత్రలను కొని చదవండి అంటే ప్రజలు వాటితో పాటు అమృతాంజనం కూడా ఒకటి కొనుక్కోవాలి అని అంటూ ఉంటారు. అంటే అవి నీరసముగా ఉంటాయని ఆలోచిస్తారు.జీవిత చరిత్రను రాసే రచయిత తన గ్రంథాన్ని అందంగా , ఆకర్షణీయంగా వినోదానికి కారణం అయ్యేట్టు గా చేయడానికి అబద్ధాలను , తన సొంత పైత్యాన్ని గ్రంథంలో నింపితే అది కేవలం చిన్న పిల్లలు చదువుకునే కథల పుస్తకంగా మారుతుంది. ఏది చెప్పినప్పటికీ సత్యమే చెప్పాలి. చక్కగా చెప్పాలి.ఆ విధంగా చెప్పిన వాడే ఘనుడు.రచయిత శైలి ద్వారా చాలా రమ్యతను తన గ్రంథానికి చేకూర్చగలడు. కాబట్టి జీవిత చరిత్రలకు” శైలి” చాలా ముఖ్యమైనదిగా ఉంటుంది.

 

ప్రశ్నలు:

1.జీవిత చరిత్రలు రాసేవారు తమ సంపాదన కోసం పిసినారిని ఎలా చూపిస్తారు?

అ)రామునిగా ఆ)భోజరాజుగా  ఇ) దానకర్ణునిగా  ఈ) బ్రహ్మగా

2.జాన్సన్ చరిత్ర రాసింది ఎవరు?

అ) బాస్వెల్ ఆ) జాన్సన్ ఇ) సంపన్నులు  ఈ) ఎవరుకారు

3. ” శైలి” ఏ రచనకు ప్రధానమైనది.

అ) ఆత్మకథలు ఆ) జీవిత చరిత్రలు   ఇ) లేఖలు  ఈ) వ్యాసాలు

4.ఎటువంటివాడు ఘనుడు అవుతాడు  .

అ) కథలు చెప్పినవాడు   ఆ) వినోదం ఇచ్చేవాడు  ఇ) సత్యాన్ని చెప్పేవాడు  ఈ) నవ్వు తెప్పించేవాడు

5.జీవిత చరిత్రలు చదవమంటే ప్రజలు కొనుక్కోవాలనుకునేది ఏది?

అ) జండూ బామ్ ఆ) జిందా తిలసమాత్  ఇ) అ,ఆ రెండూ  ఈ) అమృతాంజనం


Interactive Exercise-3

 

Share This Book