అపరిచిత గద్యాలు

20 అపరిచిత గద్యం-14

ఉజ్వల విప్లవాల ఉద్యమాలతో సంబంధం ఉన్న జమీందారు కూతురు. చిన్న వయసు నుండే విప్లవ ఆలోచనలు కలిగిన బాలిక. పర దేశీయుల రాక్షస పాలన గురించి ఆలోచించి పిడికిలి బిగించి కేక వేసింది. ఉజ్వల 1914లో జన్మించింది. 14 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు తండ్రి ఆమెను ఆయుధాలు చేరవేసే పనికి ఉపయోగించుకున్నాడు. ఉజ్వల తన మెట్రిక్యులేషన్ చదువు పూర్తి చేసుకున్న అనంతరం స్నేహితులను కలవాలి అనే వంకతో విప్లవ వీరులను చేరుకుంది. అక్కడున్న భవాని భట్టాచార్య, రవి బెనర్జీ, మనోరంజనులతో కలిసి డార్జిలింగ్ గవర్నర్ను రేసు కోర్టులో పేల్చివేసే ఎత్తుగడని వేసుకుంది. చివరికి ఆ గురి తప్పి చాకచక్యంగా పారిపోయింది. కానీ చివరకు పట్టుబడి జైలుకు వెళ్ళింది. విడుదలైన తర్వాత సుభాష్ చంద్రబోస్ సైన్య విభాగాన్ని నడపడంలో భాగం పంచుకొని ఎంతో ధైర్య సాహసాలు ప్రదర్శించింది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాతి కాలంలో సమాజ సేవ చేయడమే కాక “పాల్ నికేతనం” అనే ఒక సంస్థను నడిపింది. 1948లో పేరు పొందిన విప్లవకారుడైన భూపేంద్ర రక్షిత కిషోర్ ను వివాహమాడింది .ఒక బంతిని ఎంత బలంతో నేలకేసి కొడితే అంతే వేగంతో పైకి లేస్తుంది. ఉద్యమాల స్వభావం కూడా అటువంటిదే. ఉజ్వల జీవితం సరిగ్గా ఈ విషయానికి సరిపోతుంది.

ప్రశ్నలు:

1. ఉజ్వల విప్లవ సహచరులను ఎలా చేరుకుంది.

2. రేస్ కోర్టు లో చంపాలనుకున్నది ఎవరిని?

3. జైలు నుంచి విడుదలైన ఉజ్వల ఏ పనిలో భాగం పంచుకుంది.

4.పాల్ నికేతనం అనే సంస్థను నడిపింది ఎవరు?

5. తండ్రి తన బిడ్డను ఏ పనికి ఉపయోగించుకున్నాడు.

Share This Book