అపరిచిత గద్యాలు

25 అపరిచిత గద్యం-19

తెలంగాణ రాజకీయ, సాంఘిక, చైతన్యం అంటే వెంటనే గుర్తుకు వచ్చే పేరు సురవరం ప్రతాపరెడ్డి. మనకు దూరదృష్టి కలిగిన చరిత్రకారులు బహు తక్కువ. అటువంటి వారిలో ముఖ్యంగా మన తెలుగువారిలో ప్రముఖ చరిత్రకారుడు, కవి, విమర్శకుడు, సంఘసంస్కర్త సంపాదకుడు అయిన సురవరం ప్రతాపరెడ్డి గురించి ఈనాటి విద్యార్థులు అందరూ తెలుసుకోవాలి. ఆయన హిందువుల పండుగలు, ఆంధ్రుల సాంఘిక చరిత్ర అనే పరిశోధనాత్మక గ్రంథాలు రచించి ఈ తరం వారికి ఎంతో మేలు చేశారు. అంతే కాదు గోలకొండ పత్రిక సంపాదకుడుగా, గ్రంథాలయ ఉద్యమానికి తెలంగాణలో నాయకుడిగా సాహితీ సేవకుడిగా ప్రతాపరెడ్డి చేసిన సేవలు ప్రశంసనీయమైనవి. తండ్రి నారాయణరెడ్డి ప్రతాపరెడ్డికి మొదటి గురువు. చక్కని దస్తూరి, చదువు మీద భక్తి, భవిష్యత్తుపై ఆచంచల విశ్వాసం , సూక్ష్మ గ్రహణ శక్తి ప్రతాపరెడ్డికి తండ్రి నుండి అలవడినవి. 1924లో రాజా బహదూర్ వెంకట్రామిరెడ్డి గారు ప్రతాపరెడ్డి ఆహ్వానించి గోలకొండ పత్రికకు ఎడిటర్ గా నియమించారు. అతి తక్కువ సమయంలోనే ఆ పత్రిక సాంఘిక , సాంస్కృతిక, రాజకీయ రంగాలలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది. ప్రతాపరెడ్డి అనేక కలం పేర్లతో వ్యాసాలు రాశారు.భావకవి, రామమూర్తి గద్వాల సిద్ధాంతి, వెర్రి వెంగళప్ప, చిత్రగుప్త సంగ్రామ సింహ, యుగవతి అనే పేర్లతో మూడు వేలకు పైగా వ్యాసాలు రాశారు సురవరం ప్రతాపరెడ్డి గారి వ్యాసాలు ఆనాటి తెలంగాణను పరిపాలించిన నవాబుకు నిద్ర లేకుండా చేసేవి అనడంలో ఎటువంటి సందేహం లేదు.

ప్రశ్నలు..

1. ఎవరి ఆహ్వానం వల్ల సురవరం గోలకొండ పత్రిక ఎడిటర్ అయ్యారు.

2. గ్రంధాలయోధ్యమానికి నాయకుడు ఎవరు?

3. ఈ క్రింది వాటిలో సురవరం కలం పేరు ఏది?

4. సురవరం రాసిన చరిత్ర పుస్తకం ఏది?

5. సంఘ సంస్కర్త అంటే అర్ధం ఏంటి?

Share This Book