అపరిచిత గద్యాలు

18 అపరిచిత గద్యం-12

పరీక్షలు పూర్తయి విద్యార్థులంతా ” ఈ పాత పుస్తకాలను ఏం చేద్దాం అబ్బా” అని ఆలోచించే కాలం ఇది. అలాంటి వాళ్ళందరూ అవసరం లేని పుస్తకాలని తమకు ఇవ్వచ్చు అంటున్నాయి ఈ సంస్థలు. “అలీబాబా డాట్ కామ్” ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఈ- కామర్స్ సంస్థ. ఈ కంపెనీ 2016లో భారత్ లో అడుగుపెట్టిందే తడవుగా “మిషన్ మిలియన్ బుక్స్” అనే సేవా కార్యక్రమాన్ని ప్రారంభించింది. మన దగ్గరున్న పాత పుస్తకాలను సేకరించి అవసరమున్న నిరుపేద విద్యార్థులకు అందిస్తోంది. గత మూడేళ్లలో అంటే 2016 నుండి 2019 వరకు మూడు లక్షల పుస్తకాలను ఇలా సేకరించి రెండు వేల బడులకి అందించింది. వాటి ద్వారా లక్షల మంది నిరుపేద విద్యార్థుల్ని ఆదుకుంది. 2026 నాటికి 10 లక్షల పుస్తకాలని, పదివేల పాఠశాలలకు అందించాలని లక్ష్యంగా పెట్టుకొని పుస్తకాలు సేకరిస్తుంది. ముంబైకి చెందిన సేవా సంస్థ ‘రత్న నిధి” ట్రస్ట్ ఈ పుస్తకాలను వర్గీకరించి దేశవ్యాప్తంగా పంపిణీ చేస్తుంది. ఇక “బుక్ ఫర్ ఆల్’ నిరుపేద చిన్నారులకు విద్యను చేరువ చేయాలనే లక్ష్యంతో ప్రపంచవ్యాప్తంగా పని చేస్తున్న సంస్థ. లండన్ ప్రధాన కార్యాలయంగా ఉన్న ఈ సంస్థ రెండేళ్ల కిందట భారత్ లో తన సేవలు మొదలు పెట్టింది. ఈ సంస్థ కూడా విజయవాడ, విశాఖపట్నం నుంచి పాత పుస్తకాలను తీసుకుంటుంది. వివరాలకి www.booksforall.co.in వెబ్ సైటు ను చూడవచ్చు.

ప్రశ్నలు:

1. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఈ కామర్ సంస్థ ఏది?

2. 2016లో భారత్ లో ప్రారంభమైన సేవా కార్యక్రమం ఏ పేరుతో ఉంది.

3. 2026 వరకు ఎన్ని పాఠశాలలకు పుస్తకాలను అందించాలనే లక్ష్యం మిషన్ మిలియన్ బుక్స్ పెట్టుకుంది.

4. పుస్తకాలను వర్గీకరించే ట్రస్ట్ ఏది ?

5. బుక్ ఫర్ ఆల్ సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?

Share This Book