అపరిచిత గద్యాలు

22 అపరిచిత గద్యం-16

అనేక ప్రాణులు ఏ విధముగా వివిధ ఆకారాలతో ప్రత్యేకతలను కలిగి ఉన్నాయో, చెట్లు కూడా అదేవిధంగా వింత వింత ఆకారాలు దాల్చి చిత్ర విచిత్రమైన ప్రత్యేకతలను కలిగి ఉన్నాయి.కొన్ని చెట్లు నడుము వాల్చి పడుకున్నట్లు ఉంటాయి. మరి కొన్నిసార్లు కూర్చున్నట్లుగా , ఇంకొకసారి పొర్లుచున్నట్లుగా కనపడుతూ వంకరలు తిరిగి ఉండటం విశేషం. ఇటువంటి విచిత్రమైన మొక్క మా తోటలో ఒకటి ఉందని మౌలానా అబుల్ కలాం ఆజాద్ పేర్కొన్నారు. దాని పేరు “గోరీ ఒపాసియో వర్చా”. ఈ రకములో ఐదు మొక్కలను వేయగా ఒక నాలుగు మాత్రమే నాటుకున్నాయి. ఇప్పుడు ఈ చెట్లు పూలు కూడా పూస్తున్నాయి. ఈ పూలను చూడడానికి ఒక పది రోజుల కాలము పడుతుంది. పూలు ఏ విధంగా క్రమక్రమంగా పూస్తాయో ,అదేవిధంగా క్రమక్రమంగా పది రోజులలో వాడిపోతాయి. ఇవి వికసించే పది రోజులు చూడడానికి ఎంతో ముచ్చటగానూ, రంగులు ఆశ్చర్యంగానూ కనిపిస్తాయి. మొగ్గలు వేసినప్పుడు ఈ పూల రంగు పసుపు పచ్చ. మొగ్గలు కొద్దిగా విచ్చుకునే సమయానికి పూర్తిగా పసుపు రంగు. కొన్ని రోజుల్లోనే వీటిలో ఎరుపు రంగు కనిపిస్తుంది. క్రమక్రమంగా పసుపు రంగు పూర్తిగా పోయి పూలు ఎర్రగా ఎంతో అందంగా వికసించి మనసును ఆకర్షిస్తాయి. ఇటువంటి పువ్వు మనదేశంలోమాత్రమే ఉందనే పేరు ఉంది.

ప్రశ్నలు:

1. విచిత్రమైన మొక్క మా తోటలో ఒకటి ఉంది అని అన్నది ఎవరు?

2. పువ్వులు వాడి పోవడానికి ఎన్ని రోజులు పడుతుంది.

3. పూర్తిగా పసుపు రంగు పూలకు ఎప్పుడు వస్తుంది.

4. పై గవ్య భాగములో ఉన్న మొక్క పేరు ఏమిటి ?

5. వంకర తిరిగి ఉన్న మొక్క చూడటానికి ఎలా కనపడుతుంది.

Share This Book