అపరిచిత గద్యాలు
31 అపరిచిత గద్యం-25
హిందూ ధర్మ ఆధ్యాత్మిక వాదానికి వేదాలే శరణ్యమని ఎలుగెత్తి చాటిన వారు స్వామి దయానంద. హిందూమత నాయకులు అందరిలాగానే స్వామి దయానంద సన్యాసి, గొప్ప సంస్కృత విద్వాంసుడు. గుజరాత్ లో టంకార గ్రామంలో ఊరు చివర శివాలయం ఉంది. అక్కడ శివరాత్రి ఉత్సవం జరుగుతుంది. ఉపవాసం ఉండి భోగ్ అనే ప్రసాదాన్ని పంచేవారు. ఒక ఎలుక శివలింగం మీదకి ఎక్కి భోగ్ తినడం చూశాడు. వెంటనే అతని ముందు ఒక ప్రశ్న పుట్టింది. శివుడు శక్తివంతుడే కదా, తన మీదకెక్కిన ఎలుకను ఎందుకు కిందకు తొయ్యలేదు. అతడు తండ్రిని నిలేసి ప్రశ్నించాడు. తండ్రి జవాబు చెప్పలేకపోయాడు. మూలశంకర్ (దయానంద) మాత్రం నిద్రపోలేదు. అతని తండ్రి పేరు ఉరూ శంకర్. ఈ సంఘటన అతని జీవితాన్ని మార్చి వేసిందని చెప్పవచ్చు. కొన్నాళ్ళకు సోదరి మరణించింది. తర్వాత మేనమామ మరణించాడు. జీవిత బాధకు మరణ విమోచన మార్గం కనుగొనాలని భావించాడు. 1860లో మధుర వెళ్లి స్వామి విరజానందను కలుసుకున్నాడు. విరజానంద, దయానంద గురు శిష్య బాంధవ్యం భవిష్యత్తులో ప్రసిద్ధి చెందింది. ప్రజలందరూ మూర్ఖపు ఆలోచనల్లో ఉన్నారు. చిరు దీపం వెలిగించి వారి అజ్ఞానాన్ని తొలగించు. కుంభమేళాలో ప్రజలను ఉద్దేశించి “ఈ నదీ ప్రవాహంలో మీ తప్పులు కొట్టుకొని పోవు ” అవి మీ బుద్ధిని సక్రమంగా ఉంచుకున్నప్పుడే మాయమవుతాయని ప్రబోధించారు. అనేక రంగాలలో సంస్కరణలకు నడుము కట్టాడు స్వామి దయానంద. కాలేజీలు , విద్యాలయాలు తెరిచాడు. ఈయన మత దృష్టి సిద్ధాంతాలన్నీ సత్యార్థ ప్రకాశ అనే పుస్తకంలో ఎంతో విపులంగా ఇచ్చారు. చతుర్వేదాలు దేవుని అన్వేషిస్తాయి వాటిలో తప్పులేమీ లేవు. దేవుని . ప్రపంచంలో తప్పులకు మూల కారణం ఆత్మ బంధాలు ఉండటమే. అని చెప్పాడు. 1875లో ఆర్య సమాజం స్థాపించాడు. అప్పుడు దయానంద ఉన్న ప్రాంతాన్ని పరిపాలిస్తున్న రాజును కొన్ని అభిప్రాయాలలో తిరస్కరించినందున, రాజుకు నమ్మిన వ్యక్తి అయిన జగన్నాథ్ అనే వంటవాడు 1883 వ సంవత్సరంలో దీపావళి రోజున స్వామి దయానందకు పాలలో గాజుపొడి కలిపి ఇచ్చినందున ఆయన మృత్యువు పాలయ్యాడు.
ప్రశ్నలు
1. ఉపవాసం తర్వాత పంచే ప్రసాదం ఏమిటి?
2. శివాలయం ఎక్కడ ఉంది?
3. నదీ ప్రవాహంలో తప్పులు కొట్టుకుపోవు అని దయానంద ఎక్కడ చెప్పాడు.
4.ఆర్య సమాజం స్థాపన ఎప్పుడు జరిగింది.
5. స్వామి దయానంద గురువు పేరు ఏమిటి?