అపరిచిత గద్యాలు

30 అపరిచిత గద్యం-24

భారతదేశ ప్రథమ మహిళ ఐ.పీ.ఎస్.( ఇండియన్ పోలీస్ సర్వీస్) అధికారిణిగా “కిరణ్ బేడీ” అనేక పదవులు చేపట్టారు. 1972 బ్యాచ్ కు చెందిన ఈమె చిన్న వయస్సులోనే మంచి క్రీడాకారిణిగా గుర్తింపు పొందారు. అఖిల భారత టెన్నిస్ టైటిల్ ను , ఏషియన్ టెన్నిస్ టైటిల్ ను గెలుపొందింది. 1973 జనవరి 26న జరిగిన రిపబ్లిక్ డే పరేడ్ సందర్భంగా మొట్టమొదటి మహిళా ఐ.పీ.ఎస్. అయిన బెడీ ని చూసి ప్రజలు ఆనందానికి , ఆశ్చర్యానికి గురయ్యారు. ఇండియన్ పోలీస్ సర్వీసులో భాగంగా ఆమె తన జీవితంలో న్యూఢిల్లీ ట్రాఫిక్ చీఫ్ గా, మిజోరాం డీ.ఐ.జీ.గా, చండీగఢ్ లెఫ్టినెంట్ గవర్నర కు సలహాదారుగా, మాదకద్రవ్య వస్తువుల నియంత్రణ శాఖ సర్వోన్నత అధికారిగా పేరు గడిచింది. అంతేకాక రచయిత్రిగా పేరు తెచ్చుకొని “ఐ డేర్ ఇట్స్ ఆల్వేస్ పాజిబుల్” అనే పేరుతో ఆత్మకథలు రాసింది. 1987 లో నవజ్యోతి, 1994లో ఇండియా విజన్ అనే సంస్థలు స్థాపించి దేశానికి సేవ చేసింది. 1982లో ప్రధాని ఇందిరాగాంధీ కారు అనుమతి లేని చోట నిలిపి ఉంచారని క్రెన్ తో దాన్ని తొలగించిన కర్తవ్య ధీశాలి ఆమె. ఆనాటి నుండి ప్రజలు ఆమెను “క్రేన్ బేడీ” అని ప్రేమగా పిలిచేవారు. పురుషులైనా, స్త్రీలైనా మానసిక బలంలో సమానులని నిరూపించిన వ్యక్తి కిరణ్ బేడి .భారతదేశపు మొట్టమొదటి మహిళా ఐ.పీ.ఎస్. అధికారిణిగా గుర్తింపు పొందిన బేడి రామన్ 1994 లో రామన్ మెగాసెసే అవార్డును, 2004 లో యునైటెడ్ నేషన్స్ మెడల్ ను, 1979లో ప్రెసిడెంట్ గ్యాలరీ అవార్డును సొంతం చేసుకొని స్త్రీ శక్తిని నిరూపించింది. ఇలా ఎందరో భారతీయ మహిళలకే కాకుండా ప్రపంచ మహిళలకు కూడా ఆదర్శప్రాయం అయింది కిరణ్ బేడి. నేటి విద్యార్థులు కేవలం ఏ డాక్టర్ల ఉద్యోగాల కోసమో, ఇంజనీర్ల ఉద్యోగాల కోసమో పాకులాడకుండా సామాజిక సేవ చేయడానికి అత్యంత ప్రాధాన్యం ఉన్న పోలీసు శాఖలో కూడా ఉద్యోగాలు సంపాదించడానికి ప్రయత్నం చేసి ముందడుగు వేయాలి.

ప్రశ్నలు:

1. కిరణ్ బేడి ఆత్మ కథలు ఏ పేరుతో ఉన్నాయి ?

2. కిరణ్ బేడి రామన్ మెగసెసే అవార్డు పొందిన సంవత్సరం!

3. ప్రధాని కారును తొలగించినందుకు కిరణ్ పొందిన పేరు.

4. నవజ్యోతి సేవా సంస్థను స్థాపించిన సంవత్సరం.

5. సమాజ సేవ చేయడానికి ప్రాధాన్యత ఉన్న రంగం ఏది?

Share This Book