అపరిచిత గద్యాలు
17 అపరిచిత గద్యం-11
ఈ ప్రపంచంలో అనేక రకాల జంతువులు, పక్షులు ఉన్నాయి. వాటి ప్రత్యేకతల గురించి మనకు తెలియని విషయాలు కూడా చాలా ఉన్నాయి. ఆహారం, నీరు లేకుండా కొన్ని జీవులు నెలల తరబడి ఉండగలవు. తేనెటీగలు తమ శరీరాలపై ఒక తేనె గూడు తయారు చేసుకుని అందులో తేనెను నిలువ చేసుకుంటాయి. చలికాలంలో అది వాటికి ముఖ్యమైన ఆహారం. ఎందుకంటే ఆ కాలంలో తేనెటీగలకు నెలల తరబడి ఆహారం దొరకదు. అప్పుడు తమ శరీరంపై ఉన్న గూడులోని తేనెను ఉపయోగిస్తాయి. ఎడారి తాబేలు 50 నుండి 80 సంవత్సరాలు బతుకుతుంది. ఇవి నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రత నుండి అరవై డిగ్రీల ఉష్ణోగ్రత మధ్యలో కూడా జీవించగలవు. ఇవి తమ మూత్రాశయం లోని నీటిని శక్తిగా మార్చుకొని నెలల తరబడి ఆహార అవసరాలు తీర్చుకుంటాయి. అడవుల్లో భయంకరంగా వేటాడే జీవుల్లో కొమోడో డ్రాగన్ ఒకటి. వాటి నోటి నుండి బయటకు వచ్చే లాలాజలంలో ప్రమాదకరమైన విషం దాగి ఉంటుంది. ఇది ఒక జింకను సగం మేకను కూడా ఒకేసారి మింగ గలదు. తర్వాత వారాలు, నెలల వరకు తిండి లేకుండా ఉండగలవు. నెమ్మదిగా జీర్ణం చేసుకోగల ప్రత్యేక శక్తి వీటికి ఉంది. ఇలా మనం తరచి తరచి పరిశీలిస్తే మనిషి విస్తు పోయే వింతలతో పాటు,కళలు కూడా సకల జీవులు బ్రతుకు విధానంలో దాగి ఉన్నాయి .ఒక చీమా , ఓ సాలీడు, గిజిగాడి గూడు ఇలా ఎన్నో మరెన్నో..
ప్రశ్నలు:
1. చలికాలంలో తేనెటీగలకు ముఖ్యమైన ఆహారం ఎక్కడ దొరుకుతుంది?
2. 50 నుండి 80 సంవత్సరాలు బతికే ఎడారి జీవి ఏది ?
3. “కొమోడో డ్రాగన్” లాలాజలం లో ఏముంటుంది.
4. తాబేలు దేనిని శక్తిగా మార్చుకొని నెలల తరబడి ఆహార అవసరాలు తీర్చుకుంటుంది.
5. ఒక జింకను, సగం మేకను ఒకేసారి మింగగల జీవి ఏది?