అపరిచిత గద్యాలు
16 అపరిచిత గద్యం-10
ప్రాణాలను కాపాడేందుకు ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి శరీర భాగాలు అమరుస్తారు. ఒక్కోసారి పరిశోధనల కోసం కూడా ఒక వ్యక్తి నుంచి శరీర భాగాలను బయటకు తీస్తారు. బ్రతికి ఉన్నవారి నుంచి శరీర భాగాలను తీసి దానం చేయడం, చనిపోయిన వారి నుంచి శరీర భాగాలను వెలికి తీసి మరొకరికి మార్చడం ఈ రెండు పద్ధతులు ఉన్నాయి. అవయవ దానం ప్రక్రియ కుటుంబ సభ్యుల ఆమోదంతో నిజాయితీగా జరిగే ఒక ప్రక్రియ. ప్రపంచంలో తొలిసారిగా 1954లో అవయవ దానం చేసిన దాత “రోనాల్డ్ లీ హెరిక్ “. అతి వృద్ధ అవయవదాతగా స్కాట్లాండ్ దేశానికి చెందిన నూటా ఏడు సంవత్సరాల మహిళ తన కంటిలోని కార్నియాను దానం చేసి చరిత్రలో నిలిచారు. అవయవ దానాలు వ్యాపారంగా నిర్వహించడం చట్ట ప్రకారం నేరం. ఆగస్టు 13వ తేదీని అవయవ దాన దినోత్సవం గా ప్రకటించి ప్రపంచవ్యాప్తంగా అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈనాడు సమాజంలో అవయవ దానం పట్ల అవగాహన చాలా పెరిగింది. అనేక సందర్భాల్లో ప్రమాదాల్లో చనిపోయిన వ్యక్తుల యొక్క కళ్ళను, గుండెను దానం చేయడానికి కుటుంబ సభ్యులే ముందుకు రావడం దీనికి నిదర్శనం. గుండెను దానం చేసి ప్రాణం ఇవ్వ వచ్చు. కళ్ళను దానం చేసి, ఆ కళ్ళలో చనిపోయిన వ్యక్తిని చాలా కాలం మనం చూడవచ్చు. అందుకే ఈనాడు అన్ని దానాలలో అవయవ దానం చాలా గొప్పదిగా భావించబడుతుంది.
1. అవయవ దానం మొదటగా ఏ సంవత్సరం లో జరిగింది.
2. కార్నియాను దానం చేసిన మహిళ ఏ దేశానికి చెందినది.
3. ఆగస్టు 13 ప్రత్యేకత ఏమిటి?
4. చట్టం ప్రకారం నేరం ఏది?
5. అవయవ దానానికి ముందుకొచ్చే వారు ఎవరు?