అపరిచిత గద్యాలు

11 అపరిచిత గద్యం-5

నిజాం కాలంలోని తెలంగాణ పరిస్థితుల గురించి అబద్ధపు ప్రచారం ప్రచారం చేసి విజయం సాధించామని కొందరు తృప్తిపడి ఉండవచ్చు. ఆ కాలాన్ని కేవలం రాచరికానికి, నిరంకుశత్వానికి, భూస్వామ్యానికి, చిమ్మ చీకటికి, దోపిడీకి, దౌర్జన్యానికి మాత్రమే పరిమితం చేసి, అనేకమంది అదే ప్రచారం చేశారు. కానీ ఇక్కడి పాలకులు ముందుకు అడుగు వేయలేదా? మౌనాన్ని నాశనం చేస్తూ ఇక్కడ ఏ గొంతులూ చెడును గట్టిగా వ్యతిరేకించలేదా? కొత్త గాలి తమ ఇంట్లోకి రావాలని ఎవ్వరూ తమ కిటికీలను తెరచి ఉంచలేదా? ఇటువంటి ప్రశ్నలన్నింటికీ జవాబే ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె. శ్రీనివాస్ రచించిన” తెలంగాణ సాహిత్య వికాసం”  అనే పుస్తకం. ఆధునిక కాలంలోకి తెలంగాణను నడిపించడానికి మొదట చిన్న చిన్న అడుగులతోనే ప్రయాణం ప్రారంభమైంది. ఆ నడకే మహా కవాతుగా రూపుదిద్దుకున్నది.  అక్షరాస్యులే అతి తక్కువగా ఉన్న తెలంగాణ సమాజంలో గ్రంథాలయాల కోసం ఉద్యమాలు జరిగాయి. పోస్ట్ ఆఫీస్ లేని, రహదారులే లేని ఒక చిన్న గ్రామంలో ఉత్సాహవంతుడైన ఒకరు పత్రికనే ప్రారంభించారు. “తెలంగాణలో కవులు లేరు” అని అన్న మాటకు నొచ్చుకొని ఒక సంపాదకుడు ఏకంగా కవుల సంచికనే, అంటే తెలంగాణలో ఉన్న కవుల జాబితాను, వారి రచనలను కుప్పగా పోసి అలా మాట్లాడినవారి నోరు మూయించి మన ఆత్మాభిమానాన్ని ప్రకటించాడు. ఇలా ప్రతి తెలంగాణ విద్యావంతుడు తెలుసుకోవలసిన అనేక సత్య విషయాలను  కె. శ్రీనివాస్ గారు తమ తెలంగాణ సాహిత్య వికాసంలో పొందుపరిచారు.

ప్రశ్నలు:

  1. ఆధునికత వైపు తెలంగాణను నడిపించడానికి మొదట ప్రయాణం ఎలా ప్రారంభమైంది?

అ) ఉరుకులు పరుగులతో    ఆ) చిన్న చిన్న అడుగులతో  ఇ) ఆట పాటలతో  ఈ) ముసి ముసి నవ్వులతో

  1. “తెలంగాణ సాహిత్య వికాసం” రచయిత ఎవరు?

అ) కె. శ్రీనివాస్    ఆ) డి. శ్రీనివాస్      ఇ) మిమిక్రీ శ్రీనివాస్    ఈ) ప్రొడ్యూసర్ శ్రీనివాస్

  1. చిన్న గ్రామంలో లేని సౌకర్యం ఏది?

అ) బ్యాంక్   ఆ) రైస్ మిల్  ఇ) పోస్టాఫీస్  ఈ) సినీమాహాల్

  1. తెలంగాణలో కవులు లేరు అన్నందుకు తయారైన పుస్తకం ఏమిటి?

అ) కళాకారుల సంచిక   ఆ) శాస్త్రవేత్తల సంచిక  ఇ) వైద్య సంచిక  ఈ) కవుల సంచిక

  1. డాక్టర్ కె. శ్రీనివాస్ ఏ దినపత్రికకు ఎడిటర్?

అ) జ్యోతి    ఆ) ఆంధ్రజ్యోతి  ఇ) దివ్య జ్యోతి  ఈ)ఈనాడు

ఆంధ్రజ్యోతి ఎడిటర్  కె.శ్రీనివాస్  గారు రాసిన తెలంగాణ సాహిత్య వికాసం చివరి పేజి నుండి  సేకరణ


Interactive Exercise-5

 

Share This Book