చిన్ని పొత్తమునకు ఎన్నెన్ని కానుకలో…
ముందుమాటలో ప్రస్తావించినట్లుగా మొత్తం 64 గద్యాంశాలు, అలాగే అపరిచిత గద్యం అంటే ఏమిటి? ఎందుకు? ఎలా?, అపరిచిత గద్యం ప్రక్రియ ప్రాముఖ్యత, అపరిచిత గద్యం ఎలా రాయాలి? వంటి ప్రశ్నలకు సమాధానాలను ప్రింటు రూపంలో ఖరీదుకు రూపొందించబడింది. పుస్తకం కావలసిన వారు రచయితను సంప్రదించ గలరు.
నా ఈ చిన్ని ప్రయత్నాన్ని అభినందిస్తూ, నేను మరిన్ని వ్రాయడానికి నన్ను ప్రోత్సహిస్తూ పలువురు పెద్దలు తమ వాత్సల్యాన్ని ప్రకటించారు. వారు అందించిన ఈ కానుకలు అమూల్యమైనవి. అందుకు వారికి నా మనః పూర్వక ధన్యవాదాలు, నమస్సులు.
హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీ – తెలుగు ప్రొఫెసర్ శ్రీ పమ్మి పవన్ కుమార్ గారు, BVBPS, BHEL స్కూల్ ప్రిన్సిపల్ చేబోలు ఉమ గారు, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ హిందీ అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రీ అవినాష్, జస్ట్ రైట్ .ఇన్ వ్యవస్థాపకురాలు- శ్రీమతి సుషుమ్న గారి నుంచి వచ్చిన స్పందనలను తరువాతి పేజీలలో చూడగలరు.