AI గురించి ఎందుకు నేర్చుకోవాలి

సాంకేతికత, మార్పు మరియు మీరు

ఓ ఆలోచన

1922 లో థామస్ ఎడిసన్, చలన చిత్రాలు (మోషన్ పిక్చర్) విద్యారంగంలో విప్లవాత్మక మార్పు తెస్తుందని ప్రకటించారు. అంతేకాది అది పాఠ్యపుస్తకాలకు ప్రత్యామ్యాయం అవుతుందని నమ్మారు1.

అయినా ఉపాధ్యాయులచే ఫిల్మ్ (చలన చిత్రం) ఉపయోగం పరిమితంగానే ఉంది. అయితే 1950ల నుంచీ 1990ల వరకూ  ఫొటోగ్రఫిక్ స్లైడ్ ప్రొజెక్టర్ ను చాలామంది ఉపాధ్యాయులు స్వీకరించారు.

Voxphoto రూపొందించిన ఈ “కరోసెల్ ’77” CC BY-NC-ND 2.0 క్రింద  లైసెన్స్ చేయబడింది. ఈ లైసెన్స్ కాపీకై ఈ లంకె చూడండి:-https://creativecommons.org/licenses/by-nd-nc/2.0/jp/?ref=openverse.

 

కానీ ఇది వాడుతున్నపుడు వారు కొన్ని పరిమితులకు లోబడి ఉండాల్సి వచ్చేది. అవి:-

  • వారంతట వారు, వారి స్లైడ్లను చౌకగా తయారుచేసుకోలేకపోవడం
  •  ప్రొజెక్టర్ ను నల్లబల్లగా వాడలేకపోవడం, అంటే వారి బోధనా పద్ధతి మార్చుకోకుండా వాడే ఒక సాధనంగా ఉండకపోవడం
  • స్లైడ్ ల పునర్వినియోగం, వాటి వరుసక్రమం మార్పు, లేదా సవరణ చేయలేకపోవడం2.

ఒకవేళ, ఏదైనా ఒక కొత్త సాంకేతికత వస్తే,

  1. మీరు ఎటువంటి ఫీచర్లకై చూస్తారు? 
  2. దానిని  వినియోగించడానికి మీరు మీ బోధనా శైలి మార్చుకుంటారా? 
  3. మీ విధి విధానాల్లో మార్పుకోరే సాంకేతికతను చూసి మీరు భయపడతారా? 

కృత్రిమ మేథ – మీరు

ఒక ఉపాధ్యాయుడిగా, మీరు ప్రతిరోజూ సాంకేతికత తెచ్చిన మార్పులతో వ్యవహారాలు సాగిస్తుంటారు. ఆ మార్పులు, వాటి ప్రయోగాలు  మీరు బోధనా  ప్రపంచాన్ని, అలాగే మీ సంరక్షణలోని విద్యార్థులను మారుస్తాయి. చివరికి, అవి మీరు బోధించే విషయవ్యవహారాలను అంటే, కంటెంట్, నైపుణ్యం మరియు సందర్భాలను మారుస్తాయి. మీ బోధనా పద్ధతులను, శైలిని కూడా మార్చవచ్చు.

కృత్రిమ మేథ (AI) మీరు బోధించే విధానాన్ని ఎలా మారుస్తుందో ఈ పాఠ్యపుస్తకం వివరిస్తుంది.

AI ఎందుకు?  ఇది ప్రభావవంతంగా ఉన్న చోట, అది తీసుకువచ్చే మార్పు , దాని వేగం మరియు వ్యాప్తి అస్థిరంగా ఉంటుంది.  యంత్రం చేయలేని పని  ఉంటె దానిని చేయగల్గడం మేథావితనమా? కృత్రిమ మేథ (AI),  ఒక ఉపాధ్యాయుడిగా మిమ్మల్ని అధిగమించగలదా? అది తరగతి గదిలో మిమ్మల్ని భర్తీ చేయగలదా?  ఇలాంటి పలు కీలక ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సి ఉంది.

“డైరీ ఆఫ్ ఎ టీచింగ్ మెషిన్” అనేది CC BY-NC-SA 2.0 కింద లైసెన్స్ పొందింది. ఈ లైసెన్స్ యొక్క కాపీని వీక్షించడానికి,  https://creativecommons.org/licenses/ by-nc-sa/2.0/?ref=openverse సందర్శించండి.

నేటి కృత్రిమ మేథ అప్లికేషన్లు  ఒక నిర్దుష్టమైన పని చేయడానికి లేదా  నిర్దుష్ట రకమైన యూజర్ కై  రూపొందించబడ్డాయి – ఉదాహరణకు, మీరు రాసినదాన్ని అనువదించగల సాఫ్ట్వేర్ స్టాక్ ధరలను అంచనా వేయలేదు.

అవి చేసే పని విషయానికొస్తే, ఒప్పుకోవాల్సిందే, AI కొన్ని పనులను మానవుల కంటే మెరుగ్గా చేయగలదు. కానీ ఒక చిన్న పిల్లవాడు కూడా ఉత్తమ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఓడించగలడు. బోధన వంటి గొప్ప అభిజ్ఞా, సామాజిక మరియు సాంస్కృతిక కార్యకలాపాలలో మనిషి స్థానాన్ని భర్తీ చేయడానికి కృత్రిమ మేథ ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది. కానీ ఒక ఉపాధ్యాయుడు చేయగలిగినదాన్ని చేస్తూ వారికి సహాయపడగలదు. నిపుణులు మాట్లాడే “అగుమెంటెడ్ హ్యూమన్”3 ఇక్కడ మన విషయంలో “అగుమెంటెడ్ టీచర్” .

విద్యారంగం, బోధనలో ఎక్కడైతే AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) వినియోగం ఉంటుందో అక్కడ ఖచ్చితంగా బోధకులు/ ఉపాధ్యాయుల పర్యవేక్షణ కూడా ఉండాలని నిపుణులు నొక్కి చెబుతారు. తరగతి గదిలో సమర్థవంతమైన AI పరిష్కారాలు ఉపాధ్యాయుడికి సాధికారతను ఇస్తాయి. విద్యార్థులు ఏమి నేర్చుకుంటున్నారో ఉపాధ్యాయుడికి తెలిస్తే, ఫలితాలు గణనీయంగా ఉంటాయి.4.

AI మీకు సహాయపడుతుందా, ఎక్కడ మరియు ఎలా సహాయపడుతుందో నిర్ణయించడానికి అవసరమైన పరిజ్ఞానాన్ని ఉపాధ్యాయులకు ఇవ్వడమే ఈ పాఠ్యపుస్తకం యొక్క లక్ష్యం. కృత్రిమ మేథ తెచ్చిన మార్పులను పరిగణనలోకి తీసుకొని భవిష్యత్తు కోసం మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవడానికి  ఈ పుస్తకం మీకు సహాయపడుతుందని మేము ఆశిస్తున్నాము.

యుకెలో వివిధ ఉద్యోగాల భవిష్యత్తు గురించి రోబో మీ ఉద్యోగం తీసుకుంటుందా  అనే బీబీసీ క్విజ్ చూడండి.  సంప్రదింపులు జరపడం, ఇతరులకు సహాయం చేయడం మరియు అది పూర్తిచేయడానికి మీ సహాయ సహకారాలు అందివ్వడం వంటివి చేస్తున్నట్లయితే లేదా మీ పనిలో భాగంగా మీ ప్రతిభతో చక్కటి ఆలోచనలు అందించాల్సి వస్తే వస్తే మీ ఉద్యోగం ఆటోమేషన్ నుండి సురక్షితం అని ఆ క్విజ్ చెబుతుంది. “సెకండరీ ఎడ్యుకేషన్ టీచింగ్ ప్రొఫెషనల్”కు ఆటోమేషన్ యొక్క సంభావ్యత 1% గా ఉంది.


1 Cuban, L., Teachers and machines: The classroom use of technology since 1920, Teacher College Press, 1986.

2 Lee, M., Winzenried, A., The use of Instructional Technology in Schools, Lessons to be learned, Acer Press, 2009.

3 Holmes, W., Bialik, M., Fadel, C.,  Artificial Intelligence In Education: Promises and Implications for Teaching and Learning, 2019.

4 Groff, J., Personalized Learning: The state of the field and future directions, Centre for curriculum redesign, 2017.